ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేశ్
Updated on: 2025-11-22 06:00:00
ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన
పాత పెన్షన్, తెలుగు మీడియం కొనసాగింపుపై సంఘం వినతి
అన్ని డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ హామీ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై బోధనపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని, వారికి ఎలాంటి బోధనేతర పనులు అప్పగించబోమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ నేతృత్వంలోని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో వచ్చే నెలలో నిర్వహించే 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం)' మినహా ఉపాధ్యాయులకు ఇతర పనులేవీ ఉండవని హామీ ఇచ్చారు. డీఈఓ, ఎంఈఓలు కూడా కేవలం అభ్యసన ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించాలని, వారికి సర్వీస్ రూల్స్ వంటి బాధ్యతలు అప్పగించబోమని తేల్చిచెప్పారు. కడపలో విజయవంతమైన 'మోడల్ స్మార్ట్ కిచెన్ల'ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 17 నెలల్లో ఉపాధ్యాయ సంఘాలు తన దృష్టికి తెచ్చిన 423 సమస్యల్లో ఇప్పటికే 200 పరిష్కరించామని, మరికొన్ని పరిశీలనలో ఉన్నాయని వివరించారు.