ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ప్రకాశం జిల్లాలో లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనం
Updated on: 2025-12-09 09:38:00
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒక లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయి మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే, అనంతపురం నుంచి టమాటా లోడ్‌తో రాజమండ్రికి వెళ్తున్న లారీ పెంచికలపాడు వద్దకు రాగానే టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీనితో లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టమాటా లారీ బోల్తా పడగా, ఆయిల్ ట్యాంకర్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పైడికొండల దుర్గారావు (40) క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. ఆ వెంటనే లారీలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో అతను అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మృతుడిని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వాసిగా గుర్తించారు. విశాఖ సమీపంలోని పరవాడ నుంచి చమురు లోడ్ చేసుకుని తాడిపత్రిలోని ఒక సిమెంట్ పరిశ్రమకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.