ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
నిధులు మంజూరు కాకుండానే దుర్వినియోగం చేశామనడం హాస్యాస్పదము
Updated on: 2025-12-23 08:32:00
బొబ్బిలి మండలంలోని అలజంగి గ్రామంలో జలజీవన్ మిషన్ కింద మంజూరైన 78 లక్షల రూపాయల నిధులను తాము దుర్వినియోగం చేసి తమ స్వంతానికి వాడుకున్నామంటూ గ్రామంలో కొంతమంది చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని... గ్రామ సర్పంచ్ రేజేటి భద్రమ్మ, టిడిపి ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు రేజేటి బుజ్జిలు అన్నారు. బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి జల్జీవన్ మిషిన్ కింద కోటి 20 లక్షలు మంజూరు కాగా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో పధకం నిధులు ఖర్చు కాలేదని, . దీంతో గ్రామంలో అసలు కుళాయి పైప్ లైన్ పనులు జరగలేదని,.. తమపై నిందలు వేస్తూ కొంతమంది పబ్బం గడుపుతున్నారని, అనుమానాలు ఉంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని నిజానిజాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. దళితలమైన తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యక్తిగత ఆరోపణలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వతేజ వద్ద ప్రస్తావించగా నిధులు మంజూరు కావడం వాస్తవమే ననీ..కానీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్ళిపోయాయని, అందులో దుర్వినియోగానికి తావు లేదని తెలిపారు.