ముఖ్య సమాచారం
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
-
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
-
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
-
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
-
రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి ధర
-
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
-
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
Updated on: 2026-02-09 08:12:00
పార్టీ గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు
ఏప్రిల్లో పార్టీని అధికారికంగా ప్రకటించనున్న కవిత
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. కొత్త పార్టీ ఏర్పాటు కోసం గత నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తయితే వచ్చే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో పార్టీని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత, సొంత రాజకీయ వేదిక ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా 'జాగృతి జనంబాట' పేరుతో ప్రజల్లోకి వెళ్తూ క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటున్నారు. పార్టీ విధానాల రూపకల్పన కోసం వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించేందుకు 50 కమిటీలను ఏర్పాటు చేశారు. "సామాజిక తెలంగాణ" సాధనే లక్ష్యంగా తన పార్టీ పనిచేస్తుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు.