ముఖ్య సమాచారం
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
-
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
-
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
-
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
-
రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి ధర
-
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
-
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
Updated on: 2026-02-09 17:23:00
బంగారం వెండి ధరలు గడిచిన పదిరోజుల్లో భారీ హెచ్చు తగ్గులు నమోదు చేశాయి. బంగారం, వెండి ధరల పతనం కంటిన్యూ అవుతుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ..
కొనుగోలుదారులకు మళ్లీ షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.2050 పెరిగి రూ.1,45,600 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1680 పెరిగి రూ.1,19,130కి చేరింది.
వెండి కూడా బంగారంతో పోటీగా పెరిగింది. కిలో వెండి ధరపై రూ.15000 పెరగడంతో.. ప్రస్తుత ధర రూ.3,00,000లకు చేరింది. పెరిగిన బంగారం, వెండి ధరలకు జీఎస్టీ, తరుగు అదనంగా ఉంటుంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
పెళ్లిళ్ల ముందు పెరుగుతున్న రేట్లు
కొద్దిరోజుల్లో శుక్రమూఢం ముగిసి పెళ్లిళ్లు ప్రారంభం కానున్నాయి. వరుసగా ధరల పెరుగుదల తర్వాత.. బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తుండటంతో మరింత తగ్గుతాయని ఎదురుచూస్తున్నవారికి మళ్లీ ఊహించని షాక్ తగులుతోంది. బంగారం జ్యూవెలరీ కొనేటపుడు 22 క్యారెట్లలో వస్తుంది. దానిప్రకారం చూస్తే.. ఫిబ్రవరి 7, 9 తేదీల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.4700 (జీఎస్టీ, తరుగు లేకుండా) పెరిగింది. ఫిబ్రవరి 6న 10 గ్రాముల రేటు రూ.1,40,900 ఉంటే.. నేటికి దాదాపు రూ.5 వేల మేర పెరిగింది. ఇది కొనుగోలుదారులకు లాస్ అనే చెప్పాలి. బంగారం ధర ఇంకా తగ్గుతుందని ఎదురుచూడకుండా ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, మార్కెట్లు ఎప్పుడెలా ఉంటాయో అంచనా వేయడం కష్టమని నిపుణులు చెప్తున్నారు.