ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
పల్లె ప్రకృతి వనాలలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
Updated on: 2023-04-29 22:21:00
ప్రజలకు స్వచ్ఛమైన సహజవాయువు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనాలలో మొక్కల సంరక్షణకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. శనివారం జిల్లాలోని జైనురు మండలం కాసిపేట, మర్కగూడ, బాబుల్ గూడ, మామడ గ్రామాలలో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనాలు, గ్రామపంచాయతీ నర్సరీలు, మిషన్ భగీరథ, హెల్త్ వెల్నెస్ సెంటర్ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలలో నాటిన మొక్కలకు సకాలంలో నీటిని అందించి సంరక్షించాలని, చనిపోయిన వాటి స్థానంలో నూతన మొక్కలు నాటాలని తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీలలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను సిద్ధం చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అందించి శుద్ధ జలం సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి విడతలు భాగంగా ఎంపికైన పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలోగా సిద్ధం చేయాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం, తలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.