ముఖ్య సమాచారం
-
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ
-
బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్షపాతం నమోదు
-
తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్ లు స్టాప్...
-
కాళేశ్వరం దర్యాప్తులో మలుపు.. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు రంగం సిద్ధం!
-
కొనుగోలు చేసిన టెస్లా కార్లన్నీ వెనక్కి ఇచ్చేస్తున్న డెన్మార్క్ కంపెనీ... కారణం ఇదే!
-
జంగారెడ్డి గూడెంలో మరణాలపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
-
తక్షణం శరణార్థులు భారత్‌ను వీడాలి: సుప్రీంకోర్టు
-
ఏపీలో 60 గజాలలోపు ఇళ్ల నిర్మాణం.. అనుమతులు అవసరం లేదు: ఏపీ ప్రభుత్వం
-
ఆంధ్రా ప్రదేశ్ లో విషాదం..డీజే సౌండ్‌కు ఆగిపోయిన గుండె.
హై అలర్ట్‌లోనే ఢిల్లీ.. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
Updated on: 2025-05-09 11:25:00

ఆపరేషన్ సిందూర్ తర్వాత దాయాది పాకిస్థాన్ వక్రబుద్ధితో భారత్‌పై డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రితక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు అయ్యాయి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా వైద్య, విపత్తు నిర్వహణ విభాగాల సంసిద్ధతను సమీక్షిస్తున్నారు. "పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సున్నితమైన ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరిస్తున్నాం. రాత్రిపూట నిఘా ముమ్మరం చేశాం" అని అధికారులు తెలిపారు. ఇక, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే దేశంలో 24 విమానశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే దేశ రాజధానికి రాకపోకలు కొనసాగించే పలు విమానాలను క్యాన్సిల్ చేశారు. ఇండియా గేట్ వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానికులను అధికారులు ఆదేశించారు.