ముఖ్య సమాచారం
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
-
మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
-
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: ప్రధాని మోదీ
రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
Updated on: 2025-05-11 07:11:00

హైకోర్టుకు ఈ నెల 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 16 నుంచి పూర్తిస్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 15, 22, 29వ తేదీల్లో విచారణలు చేపడతాయి. ఇందులో భాగంగా మే 15, 22వ తేదీల్లో న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా విచారణలు చేయనున్నారు. మే 29న జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా కేసులు విచారించనున్నారు.
రెండోదశ వెకేషన్ కోర్టులు జూన్ 5, 12వ తేదీల్లో విచారణ చేపడతాయి. జూన్ 5, 12వ తేదీల్లో జస్టిస్ జస్టిస్ ఎం.కిరణ్మయి, జస్టిస్ టి.సి.డి.శేఖర్ డివిజన్ బెంచ్, జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ నిర్వహిస్తారు.