ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
అమెరికా వీసాపై కొత్త రూల్.. భారతీయులకు ఇక ఆ వెసులుబాటు కట్
Updated on: 2025-09-08 11:28:00
అమెరికా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా నిబంధనల్లో కీలక మార్పు సొంత దేశంలోనే వీసా ఇంటర్వ్యూకు హాజరుకావాలన్న నిబంధన మూడో దేశంలో అపాయింట్మెంట్ పొందే వెసులుబాటు రద్దు కరోనా సమయంలో ఇచ్చిన మినహాయింపునకు తెర భారతీయ పర్యాటకులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఇది ముఖ్య గమనిక. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ సొంత దేశంలో లేదా చట్టబద్ధంగా నివసిస్తున్న దేశంలో మాత్రమే ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లి వేగంగా వీసా ఇంటర్వ్యూ పూర్తి చేసుకునే వెసులుబాటును అమెరికా విదేశాంగ శాఖ (DoS) రద్దు చేసింది. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వచ్చింది. కరోనా మహమ్మారి సమయంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా దరఖాస్తులు భారీగా పేరుకుపోయాయి. దీంతో అపాయింట్మెంట్ కోసం దాదాపు మూడేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ జాప్యాన్ని నివారించేందుకు చాలామంది భారతీయులు దుబాయ్, బ్యాంకాక్ వంటి ఇతర దేశాలకు వెళ్లి వేగంగా బీ1 (వ్యాపారం), బీ2 (పర్యాటకం) వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసుకున్నారు. కరోనా సంక్షోభం దృష్ట్యా అమెరికా ప్రభుత్వం కూడా ఈ వెసులుబాటును కల్పించింది. అయితే, తాజాగా ఆ మినహాయింపును తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మార్పు వల్ల పర్యాటకం, వ్యాపారం, విద్య (ఎఫ్-1), తాత్కాలిక ఉద్యోగ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా అత్యవసరంగా వ్యాపార సమావేశాలు లేదా కుటుంబ కార్యక్రమాల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు. "ది వీసా కోడ్" వ్యవస్థాపకుడు జ్ఞానమూకన్ సెంతుర్జోతి మాట్లాడుతూ.. ఇప్పటికే యూరప్, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో వీసా ఇంటర్వ్యూల కోసం దరఖాస్తు చేసుకున్న అనేక మంది ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.