ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
Updated on: 2026-03-11 12:35:00
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌కు కొరత ఏర్పడింది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. దీంతో రెస్టారంట్లు మూతపడుతున్నాయి. ముంబయిలో 20 శాతం హోటల్స్‌ను మూసివేశారు. దిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కొందరు హోటల్స్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు.
గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే దోశలను తమ మెనూ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారు. తక్కువ గ్యాస్ వినియోగించే పదార్థాల వైపు మొగ్గుచూపుతున్నారు. శాండ్విచ్ వంటి ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓవెన్‌తో చక్కబెట్టే వంటకాలనూ మెనూలో చేరుస్తున్నారు. 'వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా మెనూలో మార్పులు చేస్తున్నాం. దోశ, వడ వంటి పదార్థాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం' అని కొన్ని హోటళ్ల ముందు నోటీసు బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొందరైతే ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు. ఇందుకోసం హోటల్ సిబ్బంది ప్లైవుడ్ ముక్కలను తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.