ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
Updated on: 2026-03-11 12:27:00
టీ20 వరల్డ్‌కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ నగదును ప్రకటించింది. టైటిల్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు ఏకంగా రూ.131 కోట్ల క్యాష్ రివార్డ్ ను ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ మొత్తం విలువ గతంలో ప్రకటించిన రికార్డు కంటే ఎక్కువ. 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించినప్పుడు బీసీసీఐ రూ.125 కోట్ల నగదు బహుమతి ప్రకటించగా.. ఈసారి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు సబ్యులకు రూ.131 కోట్లను ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో మూడుసార్లు ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా భారత్ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. 2007, 2024, 2026 లలో భారత్ టీ20 వరల్డ్‌కప్ కప్ లను సొంతం చేసుకుంది. ఈ సందర్బంగా బీసీసీఐ విడుదల చేసిన ఓ ప్రకటనలో జట్టులోని ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్టర్లకు అభినందనలు తెలుపుతూ.. అందరి కృషి వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని పేర్కొంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని బోర్డు కోరింది. మరోవైపు టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఐసీసీ కూడా భారీ నగదు బహుమతిని అందించింది. వరల్డ్‌కప్ గెలిచినందుకు గాను భారత్‌కు 3 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.27.48 కోట్లు) ప్రైజ్ మనీ లభించింది. వీటితోపాటు అదనంగా గ్రూప్ దశ, సూపర్ 8 దశలో ప్రతి మ్యాచ్ గెలిచినందుకు కూడా జట్టుకు బోనస్ ఇచ్చారు. ఒక్కో మ్యాచ్ విజయానికి సుమారు 31,154 డాలర్లు ( రూ.28.6 లక్షలు) లభించాయి.