ముఖ్య సమాచారం
-
డిజిటల్ అరెస్టులకు చెక్ పెట్టేలా....జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
-
ఎమ్మెల్యే బేబీ నాయనకు ధన్యవాదాలు తెలిపిన బొబ్బిలి మాజీ సైనికులు
-
ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు చేసిన సీఐడీ
-
కెవైసి, బ్యాంకింగ్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం*
-
మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..*
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
-
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
-
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్‌లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
-
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
కెవైసి, బ్యాంకింగ్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం*
Updated on: 2026-02-13 16:39:00
*కెవైసి, బ్యాంకింగ్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం* ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో కెవైసి (KYC)పై బాడంగి మండలం గొల్లాది గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బొబ్బిలి ఆర్థిక అక్షరాస్యత కేంద్ర కౌన్సిలర్స్ లక్ష్మణ్, అనురాధ, చంటిలు పాల్గొని ప్రజలకు కెవైసి అవసరం, దాని ద్వారా బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాలను సక్రమంగా నిర్వహించుకోవాలని, ఆధార్, పాన్ వంటి పత్రాలు నవీకరించుకోవడం ద్వారా లావాదేవీలు సురక్షితంగా ఉంటాయని సూచించారు. బ్యాంకింగ్ సేవల వినియోగం, డిజిటల్ చెల్లింపుల్లో జాగ్రత్తలు, సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు ఎవరైనా అనుమానాస్పద కాల్స్ లేదా లింక్స్‌కు స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బ్యాంకింగ్ భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎస్ఎస్ టి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంజనేయులు, మేనేజర్ అశోక్‌ల పర్యవేక్షణలో జరిగింది