ముఖ్య సమాచారం
-
శక్తిమంతమైన 'మినిట్‌మ్యాన్-3'ని పరీక్షించిన యూఎస్.. గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన క్షిపణి!
-
ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్!
-
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే
-
పిర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా
-
పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన
-
ఏపీలో రైతులకు శుభవార్త.. విత్తన రాయితీలు ఖరారు
-
ఏపీలో దివ్యాంగుల కోసం యూనిక్ డిజేబులిటీ ఐడెంటిటీ కార్డులు జారీ
-
ఎన్కౌంటర్ లో చనిపోయింది నంబాల కేశవరావే.... ...కేంద్ర మంత్రి అమిత్ షా
-
లిక్కర్ స్కాంపై ఎవరూ మాట్లాడవద్దు – మంత్రులకు చంద్రబాబు సూచన !
-
విజయవాడ-కర్నూలు విమాన సర్వీసులు..!
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది : శ్రీభరత్
Updated on: 2024-03-05 21:19:00

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోతోందని విశాఖ టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జి శ్రీభరత్ అన్నారు. మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు పశ్చిమ నియోజకవర్గం 92 వ వార్డు ఎస్సీ, బీసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో శ్రీ భరత్, తెలుగు తమ్ముళ్లు భారీగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో గణబాబుకు పెద్ద ఎత్తున మహిళలు హారతులు ఇచ్చి పువ్వులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ... పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల కన్నా గణబాబుకు మూడు రెట్లు మెజార్టీ వస్తుందని తెలిపారు. గణబాబుకు జనాలు స్వాగతం పలకడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని అన్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని వైసీపీ నాయకులు చెప్పి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు బెదిరించిన ప్రజలు తమకు బ్రహ్మ రథం పడుతున్నారని చెప్పారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాల పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. ప్రశాంత విశాఖ నగరంలో అధికార పార్టీ ఎంపీ ఇంట్లో ఒక కిడ్నాప్ అలాగే మేజిస్ట్రేట్ హత్యలు జరిగాయని అన్నారు. రుషికొండని ఒక పర్యాటక ప్రాంతమని చెప్పి ప్రభుత్వం దోబూచులాట ఆడుతుందని చెప్పారు. పేదవాడికి పది రూపాయలు ఇచ్చి రూ. 100 లాక్కుని ఈ ప్రభుత్వం పేదవాడి నడ్డి విరుస్తుందని మడ్డిపడ్డారు. రేపు జరగబోయే ఎన్నికలలో టీడీపీ - జనసేన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తాయని గణబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు ముగింపు పలికే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.