ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
Updated on: 2025-05-13 16:48:00

దిల్లీ:గ్రీష్మంతో మాడుతున్న దేశానికి చల్లని కబరు వచ్చేసింది.దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల (Southwest Monsoon) ఆగమనం దృష్ట్యా గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.
రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులంతటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది.మే 27 నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి.
ఈ సారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి. అలా జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం మళ్లీ ఇప్పుడే అవుతుంది. ఆ ఏడాది మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.