ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్‌లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
Updated on: 2025-05-13 16:09:00

ఇతరులను వేధించడం, ఆధిపత్యం చెలాయించాలనే ధోరణులను ప్రదర్శించే దేశాలు చివరికి ఒంటరిగా మిగిలిపోతాయని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంలో కొంత పురోగతి కనిపించడం, సుంకాల విధింపునకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఒప్పందంలో భాగంగా, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ రేటును 115 శాతం తగ్గించామని, దీనితో మొత్తం సుంకం 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితమైందని యూఎస్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. అదేవిధంగా, అమెరికా వస్తువులపై చైనా కూడా తన సుంకాన్ని అంతేస్థాయిలో తగ్గించడంతో, అక్కడ సుంకం 125% నుంచి 10 శాతానికి దిగివచ్చిందని జెనీవాలో గ్రీర్‌తో పాటు అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు.