ముఖ్య సమాచారం
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
-
మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
-
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: ప్రధాని మోదీ
-
పెళ్లి ఇంట మృత్యు గంట!...కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం: పవన్ కల్యాణ్
-
షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
-
రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
-
పీఓకేలో భారీ పేలుళ్లు, పాకిస్థాన్లోని పలు నగరాల్లోనూ డ్రోన్లు, పేలుళ్లు?
-
రైల్వేలో 9 వేలకు పైగా జాబ్స్.. గడువు తేదీ పొడిగింపు.. వెంటనే అప్లై చేయండి..
-
మన ఎస్-400, బ్రహ్మోస్ మిస్సైల్ స్థావరాలకు ఎలాంటి నష్టం కలగలేదు: సోఫియా ఖురేషి
పూంఛ్, తంగ్ధర్ సెక్టారులో రాత్రి నుంచి పాక్ బలగాల కాల్పులు: ఇండియన్ ఆర్మీ
Updated on: 2025-05-07 20:00:00

సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం భారత పౌర నివాస ప్రాంతాలే లక్ష్యంగా జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 15 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారని భారత సైన్యం వెల్లడించింది. పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతిచర్యగా ఈ కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు.ఈ దాడుల నేపథ్యంలో, బుధవారం నాడు పాకిస్థాన్ రేంజర్లు పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలోని భారతీయ గ్రామాలపై గుళ్ల వర్షం కురిపించారు. గత రాత్రి నుంచి ఈ కాల్పులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, సాధారణ పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ బలగాలు దాడులకు తెగబడుతున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు.