ముఖ్య సమాచారం
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
-
మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
-
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: ప్రధాని మోదీ
-
పెళ్లి ఇంట మృత్యు గంట!...కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం: పవన్ కల్యాణ్
-
షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
-
రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
-
పీఓకేలో భారీ పేలుళ్లు, పాకిస్థాన్లోని పలు నగరాల్లోనూ డ్రోన్లు, పేలుళ్లు?
-
రైల్వేలో 9 వేలకు పైగా జాబ్స్.. గడువు తేదీ పొడిగింపు.. వెంటనే అప్లై చేయండి..
-
మన ఎస్-400, బ్రహ్మోస్ మిస్సైల్ స్థావరాలకు ఎలాంటి నష్టం కలగలేదు: సోఫియా ఖురేషి
ఆర్మీ రైళ్ల కదలికలపై పాకిస్థాన్ గూఢచార వర్గాల నిఘా
Updated on: 2025-05-07 20:30:00

దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సైనిక రైళ్ల రాకపోకల వివరాలపై పాకిస్థాన్ గూఢచార సంస్థలు దృష్టి సారించినట్లు సమాచారం అందడంతో భారతీయ రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో, ఎలాంటి రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే బోర్డు తమ ఉద్యోగులను హెచ్చరించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
రైల్వేలోని నిర్దేశిత మిలటరీ విభాగానికి చెందిన వారికి తప్ప, మరెలాంటి అనధికార వ్యక్తులకు సైనిక రైళ్ల సమాచారం అందించినా అది భద్రతా నియమాల ఉల్లంఘన కిందకే వస్తుందని రైల్వే బోర్డు తన సందేశంలో పేర్కొంది. "సైనిక రైళ్ల కదలికల సమాచారానికి ఉన్న ప్రాధాన్యం, తీవ్రత దృష్ట్యా దీనిపై రైల్వే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి" అని అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్లకు రైల్వే బోర్డు ఆదేశాలు పంపించింది.
'మిల్ రైల్' అనేది భారతీయ రైల్వేల్లో ఒక ప్రత్యేక విభాగం. ఇది సైనిక దళాల వ్యూహాత్మక ప్రణాళికల అమలులో కీలక పాత్ర పోషిస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ సమయాల్లో సైనికులను, భారీ యుద్ధ ట్యాంకులను, ఇతర ఆయుధ సంపత్తిని, సామగ్రిని తరలించేందుకు ఈ మిలటరీ రైళ్లను వినియోగిస్తారు. ఈ రవాణాకు సంబంధించిన సంప్రదింపులన్నీ రైల్వే బోర్డు ద్వారా కాకుండా నేరుగా ఈ సైనిక విభాగం ద్వారానే జరుగుతాయి. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని సేనా భవన్లో ఉంది.