ముఖ్య సమాచారం
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
-
మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
-
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: ప్రధాని మోదీ
-
పెళ్లి ఇంట మృత్యు గంట!...కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం: పవన్ కల్యాణ్
-
షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
-
రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
-
పీఓకేలో భారీ పేలుళ్లు, పాకిస్థాన్‌లోని పలు నగరాల్లోనూ డ్రోన్లు, పేలుళ్లు?
-
రైల్వేలో 9 వేలకు పైగా జాబ్స్.. గడువు తేదీ పొడిగింపు.. వెంటనే అప్లై చేయండి..
-
మన ఎస్-400, బ్రహ్మోస్ మిస్సైల్ స్థావరాలకు ఎలాంటి నష్టం కలగలేదు: సోఫియా ఖురేషి
పాక్ గగనతలం ఖాళీ
Updated on: 2025-05-08 08:05:00

పాక్‌పై భారత్ దాడులతో ఆ దేశ గగనతలం ఖాళీ అయిపోయింది. గల్ఫ్ విమానయాన సంస్థలన్నీ పాకిస్థాన్‌కు తమ విమానాలను రద్దు చేశాయి. అమెరికా, యూరప్ దేశాల నుంచి భారత్‌కు, ఇతర దేశాలకు వెళ్లే విమానాలన్నింటినీ కూడా పాక్ గగనతలానికి దూరంగా అరేబియా సముద్రం మీదుగా మళ్లిస్తున్నారు. భారత్ తప్ప మిగతా అన్ని దేశాల విమానాలకు పాక్ అనుమతి ఇచ్చినా కూడా ఈ మళ్లింపు కొనసాగుతుండటం గమనార్హం.
అదే సమయంలో పాక్ సరిహద్దులకు సమీప ప్రాంతాలు మినహా భారత గగనతలం అంతటా విమానాల ప్రయాణాలు కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా విమాన రాకపోకల సమాచారాన్ని ప్రచురించే ఫ్లైట్ రాడార్24 సంస్థ దీనికి సంబంధించిన చిత్రాన్ని విడుదల చేసింది. బుధవారం పాక్ గగనతలంలో నాలుగే పౌర విమానాలు ప్రయాణించగా.. భారత్‌లో వందల విమానాలు ప్రయాణించడం గమనార్హం.