ముఖ్య సమాచారం
-
డిజిటల్ అరెస్టులకు చెక్ పెట్టేలా....జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
-
ఎమ్మెల్యే బేబీ నాయనకు ధన్యవాదాలు తెలిపిన బొబ్బిలి మాజీ సైనికులు
-
ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు చేసిన సీఐడీ
-
కెవైసి, బ్యాంకింగ్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం*
-
మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..*
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
-
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
-
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
-
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
డిజిటల్ అరెస్టులకు చెక్ పెట్టేలా....జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
Updated on: 2026-02-14 20:42:00
ఏపీ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ (AP Budget 2026-27)లో పోలీసు శాఖలో తీసుకువచ్చిన ఆధునికీకరణ, సంక్షేమ చర్యల గురించి ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా..“మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి” అని అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వ్యాఖ్యను ప్రస్తావించారు. పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఏర్పాటు. స్మార్ట్ పోలీసింగ్ ల్యాబ్ల స్థాపన, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు, ఆధునిక కమ్యూనికేషన్, భద్రతా పరికరాలు, సీసీటీవీ, డ్రోన్ వినియోగంతో సాంకేతికంగా దృఢమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం. కొత్త ఏపీ పోలీసు అకాడమీ స్థాపన కోసం 94 ఎకరాలు కేటాయించామని మంత్రి చెప్పారు.
నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ సంవత్సరంలో రూ.15 కోట్ల కేటాయింపులను ప్రభుత్వం ప్రతిపాదించింది. శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 4 కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్లను ప్రారంభించి 3,920 పోస్టులను మంజూరు చేశాం. పౌర-పోలీసు నిష్పత్తిని మెరుగుపర్చేందుకు 5,757 స్టైపెండరీ కేడెట్ ట్రైనీ కానిస్టేబుళ్లను నియమించాం. శిక్షణ సమయంలో వారికి ఆర్థిక మద్దతుగా నెలవారీ భత్యం .4,500నుంచి 12,000 పెంపు పోలీసు సిబ్బందికి బకాయి ఉన్న టీఏ, డీఏలు, సెలవు పోలీసు సిబ్బందికి బకాయి ఉన్న టీఏ, డీఏలు, సెలవు సంబంధిత బకాయిలు, వైద్య రీయింబర్స్మెంట్ తదితర చెల్లింపుల కోసం దాదాపు రూ.500కోట్ల విడుదల. పోలీసు కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథక పునరుద్ధరణ
గత ఐదేళ్లుగా విస్తరించిన గంజాయి సమస్యకు ప్రత్యేక విభాగం 'ఈగల్' ద్వారా, డ్రోన్ల వినియోగంతో కట్టడి. మహిళల భద్రత కోసం 'శక్తి యాప్'ను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. దీనిద్వారా 7 నిమిషాల్లోనే స్పందన లభిస్తుంది. వేధింపులకు పాల్పడేవారిపై కఠినచర్యలు ఉంటాయన్నారు.