ముఖ్య సమాచారం
-
మత్స్యకారుల మృతి వార్త దిగ్భ్రాంతి కలిగించింది: గనుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
-
కేటీఆర్ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
-
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
-
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
-
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్‌లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
Updated on: 2025-06-16 17:10:00

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, మన మార్కెట్లు రాణించడం గమనార్హం. ముఖ్యంగా ఐటీ, మెటల్, రియల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీల పెరుగుదలకు దోహదపడింది.ఈరో ఈ ఉదయం సెన్సెక్స్ 81,034 పాయింట్ల వద్ద కొంత నష్టంతో ప్రారంభమైంది. అయితే, కొద్దిసేపటికే కోలుకుని రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,865 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్, చివరికి 677 పాయింట్ల లాభంతో 81,796 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 227 పాయింట్లు లాభపడి 24,946 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.04గా ఉంది.