ముఖ్య సమాచారం
-
జగన్ సత్తెనపల్లి పర్యటనపై ఘాటుగా స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ
-
ఇరాన్ పై భారీ ఆపరేషన్ కు అమెరికా సై?
-
ఇజ్రాయెల్ ను ఖాళీ చేయండి: తమ ప్రజలకు చైనా హెచ్చరిక
-
పశ్చిమాసియాలో ఎగరని విమానాలు
-
తక్షణమే టెహ్రాన్‌ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
-
వాట్సాప్ లో ఇకపై యాడ్స్!
-
టెహ్రాన్‌ను వదిలిన 100 మందితో కూడిన భారతీయుల తొలి బృందం
-
తల్లికి వందనంకు’ కుల ధ్రువపత్రం అవసరం లేదు
-
తగలబడుతున్న టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ చానెల్
-
మరో ముంబైగా విశాఖ నగరం,,,,చంద్రబాబు
జగన్ సత్తెనపల్లి పర్యటనపై ఘాటుగా స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ
Updated on: 2025-06-17 16:49:00

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రేపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనపై సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు.
జగన్ ను నమ్మి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఎంతో మంది సర్వనాశనమయ్యారని తీవ్రస్థాయిలో విమర్శించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీకి చెందిన నలుగురు వైసీపీ కౌన్సిలర్లు నేడు టీడీపీలో చేరారు. జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు కేవలం ఒక రోజు ముందు వైసీపీ చెందిన కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు
"జగన్ ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్టుల కారణంగానే నాగమల్లేశ్వరరావు ఎన్నికల బెట్టింగ్‌లో ఏకంగా రూ.10 కోట్లు నష్టపోయారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్ర అవమానాలు ఎదురవడంతో, తట్టుకోలేక ఆయన 2024 జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇప్పుడు జగన్ రావడం సిగ్గుచేటు" అని కన్నా మండిపడ్డారు.